News

శిఖ, తిలకం ధరించిన ఉపాధ్యాయుడ్ని వేధిస్తూ… ఉద్యోగం నుండి తొలగించిన క్రైస్తవ స్కూలు

61views

లక్నోలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్‌ హిందూ అధ్యాపకుడి విషయంలో తీవ్ర వివక్షత చూపించింది. ఆ స్కూలులో గణితం బోధించే కులదీప్‌ తివారీ అనే ఉపాధ్యాయుడు శిఖతో, అలాగే నుదుటి తిలకం ధరించే పాఠశాలకు వెళితే.. ఆయన్ను క్రైస్తవ స్కూలు యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. తాను శిఖ,నుదుట తిలకం ధరించి పాఠశాలకు వెళితే.. స్కూలు యాజమాన్యం రోజూ వేధిస్తోందని వెల్లడించారు. అయితే.. తమపై ఉపాధ్యాయుడు తమపై ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, శిఖను కత్తిరించుకోవాలని, నుదుట తిలకం పెట్టుకోవడం మానేసి పాఠశాలకి రావాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. ఇంత ఒత్తిడి తెస్తున్నా.. తాను లొంగకపోవడంతోనే తనను ఉద్యోగం నుంచి తొలగించారన్నారు.

స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జైకృష్ణన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రీటా ఫ్లేమింగ్‌ రోజూ ఒత్తిడి తెస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను సనాతన సంప్రదాయాలను పాటించే వాడినని, అందుకే శిఖ ధరించానని, తిలక ధారణ చేస్తానని యాజమాన్యానికి చెప్పారు. ఇదే విషయంపై స్కూలు ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ తమ గదికి కులదీప్‌ తివారీని పదే పదే పిలిచేవారని, తన ఫిర్యాదులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసేవారు. ఇలా చేయకపోతే.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోమని, వీధుల్లో హిందుత్వ నినాదాలు చేస్తూ కూర్చోవాల్సి వుంటుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయుడు వాపోయాడు.