ArticlesNews

జాగ్రత్త… ఈ బ్యూటీ అకాడెమీకి మీ అమ్మాయిని పంపిస్తున్నారా?

64views

ఇద్దరు హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మారమని బ్యూటీ అండ్‌ మేకప్‌ ఇనిస్టిట్యూట్‌ లాక్మే అకాడెమీ మొరాదాబాద్ ఫ్రాంఛైజీకి డైరెక్టర్‌ అయిన రక్షంద ఖాన్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ముస్లిం యువకులతో స్నేహం చేయాలని, ఆ తర్వాత ఇస్లాంలోకి రావాలని హిందూ అమ్మాయిలను బలవంతం చేసింది. తాన్య చౌదరి, స్వాతిపాల్‌ అనే ఇద్దరు హిందూ అమ్మాయిలు డైరెక్టర్‌ రక్షందా ఖాన్‌పై జిల్లా కలెక్టర్‌ అనుజ్‌ సింగ్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో యూపీలోని మొరాదాబాద్‌ పోలీసులు బ్యూటీ అకాడమీ డైరెక్టర్‌పై కేసు నమోదు చేశారు. ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేయాలంటూ అందరిపై రక్షందా ఖాన్‌ ఒత్తిడి తెచ్చేదని, మతం మారిన తర్వాత వారితో నికాష్ చేసేదని తెలిపారు. . ముస్లిం యువకుల గుంపుతోనే ఎప్పుడూ హిందూ అమ్మాయిలను వుంచేదని కూడా వెల్లడించారు. అయితే.. రక్షందా ఖాన్‌ నిజానికి హిందువని, కానీ.. 17 సంవత్సరాల క్రితం ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిపారు.

యూపీలోని మొరాదాబాద్‌లోని కాంత్‌ రోడ్డులో ఈ బ్యూటీషియన్‌ అకాడమీ వుంటుంది. అనేక రకరకాల బ్యూటిషన్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. నిజానికి ఇందులో చేరింది చాలా మంది ముస్లిం అబ్బాయిలు, హిందూ అమ్మాయిలే. ముస్లిం యువకులతో స్నేహం చేయాలని అకాడమీ డైరెక్టర్‌ నిత్యం హిందూ అమ్మాయిలపై ఒత్తిడి తెస్తుంది. మరోవైపు తాను హిందువునని, కానీ.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, దీంతో తనకు నష్టమేమీ రాలేదని తరుచూ తమతో చెప్పేదని హిందూ అమ్మాయిలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘గతంలో నేను హిందువునే. కానీ ముస్లిం వ్యక్తిని పెళ్లిచేసుకున్నా. ఇప్పుడు ముస్లిం ఇంట్లోనే వుంటున్నా. ముస్లిం యువకులను పెళ్లి చేసుకుంటే ఎలాంటి నష్టం వుండదు’’ అని రోజూ తమకు చెబుతుందని హిందూ అమ్మాయిలు పేర్కొంటున్నారు.

అంతేకాకుండా తాము అడ్మిషన్‌ తీసుకునే సమయంలో ఈ ఇనిస్టిట్యూట్‌లో మాంసం, చేపలు తినడం పూర్తిగా నిషేధమని చెప్పారని కానీ.. రోజూ ముస్లిం యువకులు ఇక్కడికి తెచ్చుకొని, తమ ముందే తింటుంటారని హిందువులు తెలిపారు . ఇక డైరెక్టర్‌ రక్షందా ఖాన్‌ రోజూ హిందూ మతాన్ని అపహాస్యం చేస్తూ తిడుతుందని, తమను వేధిస్తుంటుందని హిందూ అమ్మాయిలు పేర్కొన్నారు. హిందూ అమ్మాయిలు మంగళ సూత్రం ధరించి వచ్చినా, సింధూరం ధరించి వచ్చినా.. ఇనిస్టిట్యూట్‌లోకి అసలు అనుమతించేదే కాదని వెల్లడించారు.

రక్షందా ఖాన్ అరాచకం గురించి తెలుసుకున్న విశ్వ హిందూ పరిషద్, బజ్‌రంగ్ దళ్ సహా పలు హిందూ సంస్థలు అక్కడికి చేరుకుని రక్షందా ఖాన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. లాక్మే సంస్థకు ఫ్రాంఛైజీగా ఉన్న ఈ ఇనిస్టిట్యూట్ బయట హనుమాన్ చాలీసా కూడా చదివినట్లు తెలిసింది.