News

నల్లమల అడవిలో విత్తనబంతుల కార్యక్రమం

35views

పర్యావరణవేత్త కొమెర జాజి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి నల్లమల అటవి పరిధిలో కోటి విత్తనబంతులు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ హోదాలకు సంబందించిన ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యావరణ వేత్త కొమెర జాజి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో అడవులు శాతం వృద్ధి చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, అడవులను పెంచేందుకు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. అడవులు ప్రకృతి వృద్ధి శాతం పెంచేందుకు విత్తనబంతుల విధానం ద్వారా తేలిక మార్గం అని అన్నారు.

తొలకరి జల్లులు, వర్షాకాలంలో విత్తనబంతులు చల్లడం అనేది ప్రతిఒక్కరూ ఒక ఆనవాయితీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.