ArticlesNews

త్రివర్ణ పతాకం ఆమోదానికి 77 ఏళ్ళు

73views

భారత జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి నేటితో 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. భారతజాతి స్వాభిమానానికి, స్వాతంత్య్ర దీప్తికి, సమైక్యతా స్ఫూర్తికి అద్దంపట్టే మువ్వన్నెల జెండాను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో జన్మించిన పింగళి వెంకయ్య రూపొందించటం తెలుగువారికి ఎంతో గర్వకారణం. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో మధ్యలో అశోకచక్రం, 24 పత్రాలతో రూపొందిన జాతీయ పతాకం సర్వసత్తాక భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి సంకేతంగా అలరారుతోంది.