ArticlesNews

అలసట తీర్చుకునే ప్రాంతమే అలిపిరి

63views

పూర్వం అలిపిరిని అడిపుళ అని పిలిచేవారు. అడి అంటే పాదం.. పుళ అంటే చింత చెట్టు అని అర్థం. పూర్వం పెద్ద చింత చెట్టు ఇక్కడ ఉండడంతో దీన్ని అలిపిరిగా పిలువబడింది. ఈ చెట్టు కిందే భక్తులు సేదతీరేవారు. ఇక్కడే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి.

మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలుప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి వేంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండో గాలి గోపురం మెట్ల పక్కన ఉన్నాయి.

1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలావుండేదో రాశారు. గాలిగోపురం వరకూ ఎక్కడం, దిగడం బహు ప్రయాస అని రాసుకొచ్చారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్లీ ఎక్కిదిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదని అందులో పేర్కొన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక భైరాగి శ్రీరామవిగ్రహాన్ని పూజిస్తూ, యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని పేర్కొన్నారు. అదేవిధంగా 3,055 మెట్లు ఎక్కిన తర్వాత తిరుమలకి చేరుకుంటాం. సుమారు 12 కిలోమీటర్లు ఉంటుంది. అలిపిరి మార్గంలో భక్తుల సౌకర్యార్థం 1,500 టికెట్లను మంజూరు చేస్తున్నారు.