News

ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న సోరెన్‌

124views

గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు ‘ల్యాండ్ జీహాద్’, ‘లవ్ జీహాద్’లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. వేలాది మంది చొరబాటుదారులు గిరిజన అమ్మాయిలను వివాహం చేసుకుని, సర్టిఫెకెట్లు పొందుతున్నారని, భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే గిరిజనుల జనాభా తగ్గిపోగా, రాబోయే రోజుల్లో గిరిజనుల జనాభా మరింత తగ్గిపోనుందని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా గిరిజనుల భూములు, భౌగోళిక ముఖచిత్రం, రిజర్వేషన్లకు భద్రత కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.