News

తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంపు

52views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామన్నారు టిటిడి కార్యనిర్వాహణాధికారి జె.శ్యామలారావు. తిరుమలలో పాత్రికేయులతో ఈవో మాట్లాడుతూ మరింత మేలు రకమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్టు బుకింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి దళారీ వ్యవస్థను అడ్డుకున్నామన్నారు. సామాన్య భక్తులకు నిరంతరం అన్నపానీయాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తిరుమలలో మూడు చోట్ల అదనంగా అన్నప్రసాద కేంద్రాలను తీసుకొచ్చామని..నూతనంగా మొబైల్ టాయిలెట్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నిత్యం భక్తులు భుజించే తరిగొండ వెంగమాంబ భవనంలో అన్నప్రసాద నాణ్యతను పెంచామన్నారు. నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు ప్రైవేటు హోటళ్ళలో భోజనాలను భక్తులకు విక్రయిస్తే అలాంటి షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్లాటెడ్ సర్వదర్సనం టోకెన్ల జారీని వారానికి లక్షా 5వేల నుంచి లక్షా 47వేలకు పెంచినట్లు చెప్పారు. నకిలీ ధృవపత్రాలతో దర్సనాలను పొందేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళారీ వ్యవస్థను తిరుమలలో పూర్తిగా అరికడతామన్నారు.