News

350 ఏళ్ల తర్వాత భారత్‌కు ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం

85views

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్‌ నఖ్‌’ (పులి పంజా) 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరింది. బుల్లెట్‌ప్రూఫ్‌ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ఉంచారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఇతర నాయకులు తరలివచ్చారు. సతారాలో ఏడు నెలల పాటు ‘వాఘ్‌ నఖ్‌’ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇన్నాళ్లుగా లండన్‌లోని అల్బర్ట్‌ మూజియంలో ఈ ఆయుధం ఉంది. ప్రజలకు చూపించాలని సంకల్పించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల పాటు ఉంచుకునేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.

చరిత్ర ప్రకారం.. 1649లో ఛత్రపతి శివాజీ బీజాపుర్‌ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు బీజాపుర్‌ సేనాధిపతి అఫ్జల్‌ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా దాచుకున్న ఈ వాఘ్‌ నఖ్‌ను ఉపయోగించి అతడిని అంతమొందించాడు. ఈ ఘటన ప్రతాప్‌గఢ్‌ కోటలో జరిగింది. ఇది ప్రస్తుతం సతారాలో ఉంది. అందుకే ఈ ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది.