News

శ్రీవాణి ఆఫ్‌లైన్‌ కోటా కుదింపు…..రోజుకు వెయ్యి టికెట్లకే పరిమితం చేసిన టీటీడీ

47views

తిరుమలలో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను టీటీడీ కుదించింది. శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా 22వ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికే పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు కొద్దిరోజులు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి పరిమితి లేకుండా శ్రీవాణిటికెట్లను జారీ చేస్తూ వచ్చారు. ఆన్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌లో రోజుకు 2 వేల వరకు టికెట్ల కేటాయింపు జరిగింది. అయితే ప్రస్తుతం రద్దీ పెరుగుతున్న క్రమంలో ఆన్‌లైన్‌లో 500తో పాటు ఆఫ్‌లైన్‌లో మరో వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో 900 టికెట్లను తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మొదటవచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు. ఇక, మరో వంద టికెట్లను రేణిగుంటలోని విమానాశ్రయంలో కేటాయిస్తారు. బోర్డింగ్‌ పాస్‌ ద్వారా వీటిని భక్తులు పొందవచ్చు.