News

ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు

56views

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలతో పాటు డ్రైఫ్రూట్స్, యాపిల్, టమాట, నిమ్మ, యాలకులను అమ్మవారిని అలంకరణకు వినియోగిస్తున్నారు. అంతరాలయంలో మూల విరాట్‌కు కనకాభరణాల స్థానంలో అలంకరించే దండలను అర్చకులు ఈవో రామారావు పరిశీలించారు. మల్లికార్జున మహా మండపంలో 180 మంది సిబ్బంది కూరగాయలను దండలుగా తయారు చేస్తున్నారు. లోక కల్యాణంతో పాటు పంటలు బాగా పండేందుకు శాకంబరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లు చేయాలని ఈవో రామారావు అధికారులకు సూచించారు.