News

అవధాన ప్రక్రియ తెలుగు భాషకు గర్వకారణం

56views

తెలుగు భాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని సహజ సాహితీ సంస్థ వ్యవస్థాపకుడు, కవి వడలి రాధాకృష్ణ అన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో సహజ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విద్యా కాలేజీలో అవధాని మానేపల్లి నాగకుమారశర్మ అష్టావధానం నిర్వహించారు. కోడూరి ఏకాంబరేశ్వరబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు గర్వకారణమని, తెలుగువారి సొత్తని తెలిపారు. అవధాని అంటే ఎంతో ఏకాగ్రత ఉన్న పండితుడనే అర్థం వస్తుందని వివరించారు. అవధానానికి విశేషమైన భాషా పాండిత్యం, సమయస్ఫూర్తి, కల్పనా చాతుర్యం, చమత్కారం సమపాళ్లలో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అవధాని మానేపల్లి నాగ కుమారశర్మకు చిలకపాటి కృష్ణమాచార్యులు, రంగనాయకమ్మ సాహితీ పురస్కారం–2024 ‘ధారణా ధురీణ’ బిరుదును ప్రదానం చేశారు. అనంతరం రావులకొల్లు వెంకట రంగాచార్యులు వేదాశీస్సులు అందజేశారు.