News

శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం, ఆర్జిత సేవలు రద్దు

50views

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకువచ్చి అలాగే ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

అలాగే సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సిఫార్సు లేఖల స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది.