News

చంద్రుడిపై వేగంగా గడుస్తున్న సమయం: నాసా

57views

భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నట్టు నాసా గుర్తించింది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు చంద్రుడిపై సమయాన్ని అధ్యయనం చేసి.. భూమితో పోలిస్తే చంద్రుడిపై సమయం రోజుకు 0.0000575 సెకన్లు వేగంగా గడుస్తున్నట్టు తేల్చారు.

చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇది చాలా చిన్న తేడానే అనిపించినప్పటికీ అంతరిక్ష ప్రయోగాలు, నావిగేషన్‌ వ్యవస్థలకు సంబంధించి ఈ సూక్ష్మ తేడాను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.