News

అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు

65views

అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న మూడు అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత, ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్ర లాల్ పేరు పెట్టారు. మిగిలిన రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్లోని ముర్సాన్ పట్టణం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఆ ప్రకారం వాటిని ఇకపై లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా వ్యవహరి స్తారు. అహ్మదాబాద్ లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధ కులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం 2021లో మార్స్పై అగ్నిబిలాలను గుర్తిం చారు. వాటికి పెట్టిన పేర్లకు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఐఏయూ) ఈ నెల 5న ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారత అంతరిక్ష విభాగం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.