News

మంచు యుగానికి నక్షత్ర ధూళే కారణం!

53views

సౌర కుటుంబం 20 లక్షల సంవత్సరాల క్రితం దట్టమైన ధూళి మేఘం గుండా పయనించి ఉంటుందని, దానివల్ల భూమిని అతి శీతల వాతావరణం ఆవహించి ఉంటుందని అమెరికన్‌ పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం వరకూ భూమి తరచూ హిమ యుగాల్లోకి జారిపోతూ వచ్చిందని అంటున్నారు. సౌర కుటుంబం చుట్టూ హీలియోస్పియర్‌ బుడగలా ఆవరించి ఉంటుంది. సూర్యుడి నుంచి నిరంతరం వచ్చే విద్యుదావేశ కణాలతో ఇది ఏర్పడుతుంది. సౌర కుటుంబం వెలుపలి నుంచి భూమికి వచ్చే కిరణాలను సూర్యుడి బుడగ అడ్డుకుంటుంది. లేకపోతే ఆ కిరణాలు మన జన్యువుల్లో విపరీతమైన మార్పులు తీసుకువచ్చేవి.