News

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

61views

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలుఆదివారం ఉదయం పాడేరు లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్టు వరకు బారిగా ఊరేగించారు. అమ్మవారిని, పాదాలను ఎత్తుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మోదకొండమ్మను అత్తవారింటి నుంచి పుట్టింటికి తోడ్కొని వచ్చి పుట్టిల్లుగా భావించే శతకంపట్టులో ప్రతిష్ఠించారు. ఈ సంద ర్భంగా భక్తులు ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. మిగిలిన రెండు రోజులు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సుమారు 750 మంది పోలీసులతో గట్టవి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, జేసీ, పీవో, జిల్లా ఉన్నతాధికారులు ఉత్సవాలకు హాజరయ్యారు.