News

సంఘ కార్యాన్ని పల్లె పల్లెకీ విస్తరించాలి : సహ ప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్

99views

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్‌ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు తెలంగాణ సహ ప్రాంతప్రచారక్‌ ప్రభు కుమార్‌ వున్నారు. ఆయన ప్రసంగిస్తూ,
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ వ్యక్తి నిర్మాణం ద్వారా నిరంతరం కృషి చేస్తోంది. సంఘం యొక్క లక్ష్యం హిందూ సంఘటనం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం. కాబట్టి సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావల్సిన స్వయంసేవకుల నిర్మాణం నిత్యశాఖలో జరుగుతుంది. అలాగే శాఖని సరైన పద్ధతిలో నిర్వహించి, ఆ శాఖలో స్వయంసేవకులుగా, రాబోయే రోజుల్లో కార్యకర్తలుగా వారిని నిర్మాణం చేస్తూ.. రాబోయే రోజుల్లో వారు సంఘటకులుగా నిర్మాణం కావడం కోసం ఇలాంటి శిక్షావర్గలు జరుగుతుంటాయి. కాబట్టి సంఘ నిర్మాణం కోసం కార్యకర్తలు అవసరం. వారిని తయారు చేయడమే ఈ సంఘశిక్షావర్గల ముఖ్య ఉద్దేశం. సంఘ శిక్షావర్గలో శారీరక, బౌద్ధిక, మానసిక శిక్షణ ద్వారా ఈ దేశం కోసం తన జీవితాన్ని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని కొంత గడుపుతూనే.. సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి సామర్థ్యం, యోజన అలాంటి ఆలోచన కలిగేటటువంటి ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు అలా తయారవుతారు. అలా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక పద్ధతుల్లో సంఘ శిక్షావర్గలు నిర్వహిస్తూ.. కార్యకర్తల నిర్మాణం జరుగుతూ వస్తోంది.