ArticlesNews

రామాయణ, భారతాలు, చరిత్ర అంటే వివాదమెందుకు?

88views

ఇందుకు కారణం మన వలసవాద చైతన్యం లేదా స్పృహే అని చెప్పాలి. వలసవాదులు మనసు పాలిస్తున్న సమయంలోనూ, తర్వాత కూడా మన మేధో పరమైన చట్రాన్ని పూర్తిగా, శాశ్వతంగా మార్చివేసి మనసు పదిలివెళ్లడంతో, మన సంస్కృతి, చరిత్ర గురించి వారు చెప్పిందే వాస్తవమనే భావనకు లోనవు తుంటాం. అందుకే, రొమిల్లా థాపర్ వంటి చరిత్రకారులు ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని సమర్థిస్తూ, రామాయణాన్ని తక్కువ చేసి చూపారు.

ఇలా వలసవాదులు భారతదేశాన్ని పదిలివెళ్లిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా పలు తరాలు ఈ దేశానికి సంబంధించిన వాస్తవ చరిత్ర ఏమిటన్నది తెలుసుకోలేకపోయాయి. రాముడిని, కృష్ణుడిని పూర్తిగా దేవుళ్లుగా భావించి వారిని పూజించడం తప్ప ఆ పాత్రల చారిత్రిక ప్రాధాన్యం చూడలేకపోయాం. ఈ గ్రంథాలన్నీ కూడా మత పరిధిలోకి రావడం, వలసవాద కోణమే ప్రధానంగా ఉన్న పాఠ్యాంశాలను యువత చదవడంతో, వాటిలో ఉన్న భిన్న కోణాలను చూడటంలో విఫలమైంది. ముఖ్యంగా సనాతనమంటే మతమనే భావన పాశ్చాత్యులు ప్రచారం చేయడంతో మనం కూడా అదే భావనలో చిక్కుకున్నాం. మనది సనాతన ధర్మం, ధర్మమంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించడం తప్ప మరొకటి కాదు. కుల, వర్గ, మత బేధం లేకుండా అందరూ గౌరవించి, అనుసరించ వలసిన వైశ్విక స్థాయి అచారం లేదా నీతే ధర్మం. ఇదే ఈ రెండు గ్రంథాలలోనూ అంతర్లీనంగా ప్రవహించే సూత్రం.

మనకన్నా పాశ్చాత్యులే మన జ్ఞానఖనిని ఎక్కువగా గుర్తించి, ఉపయోగించుకుంటున్నారు.వేదాలు జర్మనీ చేరి, అక్కడ అనువాదితమై వారి జ్ఞానఖనిగా మారాయి.పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో భగవద్గీత, కౌటిల్యుని అర్థశాస్త్రం సహా మన గ్రంథాలను బోధస్తుండగా, ఇక్కడ మాత్రం వాటిని పెరటిమొక్కలుగానే పరిగణిస్తున్నారు.