News

అంతరిక్షంలో వెయ్యి రోజులు.. రష్యా వ్యోమగామి ఒలెగ్‌ రికార్డు

67views

అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు. ఒలెగ్‌ కొనొనెన్కో(59) 2008 నుంచి ఐదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్‌ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్‌ బుధవారం ప్రకటించింది.

2024 సెప్టెంబర్‌ 23 వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు. అప్పటికి 1,110 రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది. కాగా, ఒలెగ్‌ తర్వాత 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకే చెందిన గెన్నడీ పడల్క 2015లో సృష్టించారు.