News

ఈశ్వరీయ కార్యంలో నిమగ్నం చేసుకునే వారిదే ఈ ప్రపంచం

52views

ఎవరైతే కర్తవ్య పరాయణులవుతారో వారిదే ఈ ప్రపంచం. మేం ఏ పనీం చేయం. ఖాళీగా ఇలా కూర్చుంటాం. అనే వారికి ఇహలోకమూ వుండదు. పరలోకమూ వుండదు. కష్టపడి పని చేసేవారిదే ఈ ప్రపంచం. నిరంతర ప్రయత్న శీలురదే ఈ ప్రపంచం. తమ స్వార్థాన్ని సంపూర్తిగా త్యజించ, తమను తాము ఈశ్వరీయ కార్యంలో నిమగ్నం చేసుకునే వారిదే ఈ ప్రపంచం, ఇహలోకము, పరలోకము వారినే గౌరవిస్తాయి, ఆదరిస్తాయి. కాబట్టి మనం ఎలాంటి స్వార్థ భావన లేకుండా వ్యక్తిగత ఆకాంక్షలు, కోరికలను వదిలిపెట్టి మనలో వున్న పాశవిక లక్షణాలను పరిత్యజించి, కేవలం ఒకే ఒక మార్గదర్శక సిద్ధాంతాన్ని చేతబూని కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోవాలి. ‘‘ఇది మన పవిత్ర భూమి. ఈ భూమికి నేను సేవ చేయాలి. ఈ భూమి పుత్రులైన హిందూ జాఇకి చెందిన పవిత్ర సంతానానికి సేవచేయాలి. వారందరినీ ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠులుగా తీర్చిదిద్దడం నా పరమ కర్తవ్యం. ఇందుకోసం తగినట్లుగా నేను నా మన: ప్రవృత్తిని మార్చుకుంటాను. నా బుద్ధి, వివేకము, శారీరక సామర్థ్యం లాంటి ఆవశ్యక లక్షణాలను, గుణాలను సంపాదించుకుంటాను. వాటి ద్వారా నా ఈ కర్తవ్యాన్ని ఉత్తమ రీతిలో పూర్తి చేయగలుగుతాను. హిందూ సంఘటనకు నేను అనుకున్న స్వరూపాన్ని సంతరించి పెడతాను’’ అని నిరంతరం మననం చేసుకుంటూ వుండాలి.-గురూజీ