News

పర్యావరణాన్ని కాపాడేందుకు భారత నౌకాదళం కృషి

72views

ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని భారత నౌకాదళం పునరుద్ఘాటించింది. బుధవారం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా భూ పునరుద్ధరణ ఎడారీకరణ నిరోధం, కరువు సమయాల్లో పటిష్టంగా పనిచేసే వ్యవస్థలు అనే ఇతివృత్తానికి అనుగుణంగా తాము పని చేస్తామని భారత నౌక దళం తెలిపింది. పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహిస్తామని సుస్థిరమైన పద్ధతులను అమలు చేస్తామని కూడా తెలియచేసింది. మిస్టీ కార్యక్రమం కింద మొక్కలు నాటడం సముద్ర నార పెంపుదల కోరల్ రీఫ్ సర్వేలు నిర్వహించడం మొదలైన కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళం పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న ప్రభుత్వ శాఖలతో కలిసి కృషి చేస్తుంది. హెచ్ సి ఎల్ ఫౌండేషన్ హాబిటాట్ ట్రస్టులతో కలిసి సమన్వయంతో భారత నేవీ కోస్తా ప్రాంతాల్లో సముద్ర పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ సముద్ర జీవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ పథకం కింద పుమార్ వినియోగ ఇంధనం వినియోగం ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం జల సంరక్షణ మొదలైన అన్ని పర్యావరణ లక్ష్యాల కోసం పనిచేయడంతో పాటు నౌక దళం నూతనంగా నిర్మించే భవనాలకు గృహ 3 నిబంధనలు అమలు అయ్యేలాగా చూస్తోంది. వస్తా ప్రాంతాలను పరిరక్షించడం ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ మొదలైన వాటికోసం పునీత్ సాగర్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కూడా నౌకదళం చేపట్టింది.