News

హిమాలయాల్లో విషాదం, ముమ్మరంగా సహాయ చర్యలు

61views

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు ప్రాణాలు వదిలారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద మంచులో చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

హిమాలయన్ ట్రెక్కింగ్ ఏజెన్సీ ‘మనేరి’ ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ టీమ్ మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రెక్కింగ్‌ పాయింట్‌కు చేరుకుందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ తెలిపారు.

జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం ప్రతికూలంగా మారడంతో వారంతా దారి తప్పారని బిష్త్ చెప్పారు. తప్పిపోయిన వారి జాడ తెలుసుకునేందుకు ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడంతో పాటు సహాయం కోసం భారత వైమానిక దళాన్ని అభ్యర్థించామన్నారు. సహాయ చర్యల కోసం అటవీ శాఖకు చెందిన 10 మందితో పాటు SDRF టీమ్ ఘటనాస్థలికి పయనమైంది.