News

విజయవాడలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

1.4kviews

సమాజం, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో రామాయణం బోధిస్తే.. రామునికి నమ్మినబంటుగా హనుమంతుడు చూపిన ప్రేమ, అభిమానం, స్వామి భక్తి వంటివి.. అనుసరించాల్సిన మార్గాలుగా భావించాలని శైవపీఠాధి పతి శివస్వామి అన్నారు.హనుమంతుడు ఆదర్శనీయుడు అని కొనియాడారు. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్, భజరంగదళ్ ఆధ్వర్యంలో హనుమజ్జయంతి పురస్కరించుకుని శనివారం సాయంత్రం విజయవాడలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం హిందూ సమాజం నిర్వీ ర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనలో పోలీసుల అణచివేత ఎక్కువగా ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం చేసుకోనివ్వకుండా ఆంక్షలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు.

విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ కార్యదర్శి తనికెళ్ళ సత్యరవికుమార్ మాట్లాడుతూ.. గత అయిదేళ్లలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. లవ్ జిహాదిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనాలతో కూడిన శోభాయాత్ర.. సత్యనారాయణపురం బీఆర్ ఎస్ రహదారిలో శారదా కళాశాల వద్ద ప్రారంభమై..పూర్ణానందంపేట మీదుగా పాతబస్తీ వినాయ కుడి గుడి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, బిజెపి నాయకులు దుర్గాప్రసాద్ రాజు, సాన శ్రీనివాస్, రాఘవరాజు, నాగలింగం శివాజీ, శివప్రసాద్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.