News

బెంగాల్, హర్యానా , ఉత్తరాఖండ్ లో పౌరసత్వ సర్టిఫికేట్ల జారీ

63views

నూతన పౌరసత్వ సవరణ చట్టంలో (సీఏఏ) భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురు పౌరులకి పౌరసత్వ సర్టిఫికేట్లను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికేట్లను అందజేశారు.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది. తమ రాష్ట్రంలో ససేఏఏను అమలు చేయనీయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అమలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ష పేర్కొంటూ వచ్చారు. మరోవైపు మొదటి విడత పౌరసత్వ సర్టిఫికేట్లను ఈ నెల 15న అందజేససన విషయం తెలిసందే. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా 14 మందికి అందజేశారు.