News

అన్నప్రాశనలో ఆధ్యాత్మిక కోణం

78views

మన హైందవ ధర్మంలో అన్నప్రాశనను వేడుకగా చేయటం సంప్రదాయం. ఆ సమయంలో ఆహారాన్ని ముందుగా భగవంతుడికి నివేదించి, తర్వాత శిశువుకు గోరంత తినిపిస్తారు. ఆరు నుంచి ఏడు నెలల వయసులో చిన్నారులకు ఈ వేడుక నిర్వహిస్తారు. పవిత్రం, ఆరోగ్యకరం అయిన పదార్థాలను భుజించే అలవాటు చేయటానికే ఈ అన్నప్రాశన ఉత్సవం. ఈ సందర్భానికి సంబంధించిన ప్రార్థన అధర్వ వేదంలో కనిపిస్తుంది. ‘ఓ శిశువా! ఈ అన్నం నీకు తగిన బలాన్నీ, పుష్టినీ ఇచ్చుగాక! వ్యాధులను నశింపజేయు గాక! పవిత్రమైన ఈ ఆహారం పాపాలను పోగొట్టుగాక!’ అనేది ఆ శ్లోక భావం. అలాగే ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః’ అంటోంది ఛాందోగ్య ఉపనిషత్తు. అంటే పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మన శరీరంలో మంచి గుణాలు పెంపొందుతాయి అనేది అర్థం. చిన్పప్పటి నుంచే ఈ సంస్కారాన్ని పాదుకొల్పాలి అన్నదే అన్నప్రాశన ఉత్సవం నిర్వహించడంలోని ఆధ్యాత్మిక కోణం.