News

తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు

92views

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో జూన్ నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. జూన్ 1వతేదీ నుంచి 5వతేదీ వరకు తిరుమలలోని ఆకాశగంగ-అంజనాద్రి-బాల ఆంజనేయస్వామివారి ఆలయాల్లో హనుమజ్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తెలిపింది. అలాగే జూన్ 2వతేదీన మహి జయంతిని నిర్వహిస్తున్నామని..అలాగే జూన్ 19వతేదీ నుంచి 21వతేదీ వరకు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జ్యేష్టాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే జూన్ 20వతేదీన శ్రీనాథమునుల వర్ష తిరు నక్షత్రంను నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా జూన్ 22వతేదీన పౌర్ణమి రోజు గరుడ సేవను కూడా నిర్వహిస్తున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.