ArticlesNews

మహాభారత యుద్ధకాలం

1.4kviews

భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రముఖ సంఘటన. కృష్ణద్వైపాయన నామధేయుడైన వేదవ్యాసుడు నేటి బిహార్ లోని రాజగృహం అనే చోట ఒక గుహలో సమాధిస్తుడై మహాభారతాన్ని రచించాడు. సర్వకాల, సర్వధర్మ సర్వదేశ జ్ఞానకోశం మహాభారతం. ఇది పంచమ వేదంగా అభివర్ణితమైన సర్వ విజ్ఞానవర్వం. ఈ గ్రంథరచనకు మూడు సంవత్సరాలు పట్టింది. భారతదేశాన్ని ఏలిన రెండు వంశాలు తమ ఆధిపత్యస్థాపనకై జరిపిన సంగ్రామ గాథ ఇందులో వర్ణితం. ఇది ధర్మానికి, అధర్మానికి జరిగిన ధర్మయుద్ధం.

భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అపూర్వ సంఘటన.క్రీస్తు పూర్వం 3101లో కలియుగం ప్రారంభానికి ముందు 36 సంవత్సరాల పూర్వమే అంటే క్రీస్తు పూర్వం 3137లో ఢిల్లీ సమీపంలోని కురుక్షేత్ర మైదానంలో ఈ యుద్ధం జరిగింది. అయితే ఆధునిక చారిత్రకవేత్తలు ఈ తేదీని రకరకాలుగా చెపుతున్నారు.

మేజర్ ఏల్ అనే చరిత్రకారుడు ఈ యుద్ధం క్రీస్తుపూర్వం 889లో జరిగిందన్నారు.బెంట్లీ ఈ తేదీని క్రీ.పూ. 575 గాను, పార్టిటెర్, కీ.పూ 850 అని, సీతానాథ్ ప్రధాన్ కీ.పూ 1250 అని, కె.పి. జైస్వాల్ కీ.పూ 1450 అని, ప్రీమ్యౌరన్ హిస్టరీ ఆఫ్ బిహార్ అనే గ్రంథంలో త్రివేది క్రీ.పూ 1887 అని, వెలాండ్ అయ్యర్ క్రీ.పూ 1194 అక్టోబర్ 14, అని సతీశ్ చంద్ర విద్యాభూషణ్ క్రీ.పూ 1922 అని, డి.ఎస్. త్రివేది క్రీస్తు పూర్వం 3137 అని, తాల్బోయన్ వేలర్ క్రీ.పూ 6000 జి.డి.య చౌలియత్ క్రీస్తు పూర్వం 19000 అని భావించాడు.