News

సనాతన ధర్మ పరిరక్షణతోనే మనుగడ

88views

హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని ఆలయ అర్చకులు ఉద్భోదించారు. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల చినవెంకన్న ఆస్థానంలో వేదసభను ఆలయ అర్చకులు, పండితులు నిర్వహించారు. తిరుకల్యాణ మహోత్సవాల సమయంలో రథోత్సవం మరుసటి రోజున వేదసభను నిర్వహించడం సంప్రదాయబద్ధమైంది. తొలుత ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక అలంకరణలు చేశారు. మేళతాళాలు, సన్నాయివాయిద్యాలతో స్వామివారి వాహనాన్ని నిత్యకల్యాణ మండప వేదికపై తీసుకొచ్చి మూర్తులను ఉంచి అలంకరించారు. వేదికపై అర్చకులు వారికి ఎదురుగా పండితులు, అధికారులు, ఆగమ విద్యార్థులు కొలువుతీరారు. ఈ క్రమంలో కల్యాణమూర్తులను కీర్తిస్తూ మంత్రోచ్ఛరణలు నిర్వహించారు. ఆ తరువాత నీరాజన మంత్రపుష్పాలనను సమర్పించారు. ఆలయ అర్చకులు, పండితులు, అధికారులను ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి అలహసింగరాచార్యులు సత్కరించారు.