News

ఆలయాల్లో వస్త్ర ధారణ, బొట్టు విషయంలో నిర్ధిష్ట నియామాలు

76views

సనాతన ధర్మం నుంచి వచ్చిన ఆచారాలకు ప్రాణం పోయడానికి సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆలయాల్లో కట్టు, బొట్టు తప్పనిసరి చేశారు. ఇప్పటికే అన్నవరం, చిన తిరుపతి వంటి ఆలయాల్లో వస్త్రధారణతో పాటు బొట్టు విషయంలోనూ కఠిన నియమాలు అమలు చేస్తుండడంతో దానిని అన్ని దేవాలయాల్లో అమలు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో పలు ఆలయాల్లో వస్త్ర ధారణ, బొట్టు విషయంలో నిర్ధిష్ట నియామాలు అమలు చేయడం ప్రారంభించారు.

పిఠాపురంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులు ఇక నుంచి తిరునామాలు ధరించాల్సిందేనని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ఈఓ సౌజన్య ఆదేశాలు ఇచ్చారు. అభిషేకాలు, అర్చనల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణను తప్పనిసరి చేస్తూ ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్నిరోజుల పాటు నియమాలు పాటించిన అధికారులు తరువాత వాటిని గంగలో కలిపేశారు. కట్టు, బొట్టు నిబంధనలు పట్టించుకోడం మానేశారు.

దీనిపై శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ఈఓ సౌజన్యను వివరణ కోరగా పాదగయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.