News

విశాఖలో అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవం

74views

గిరిజనుల సాంస్కృతిక హస్తకళా నైపుణ్యాన్ని ప్రపందానికి దాటిచెప్పేందుకు అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవంలో విశాఖ జిల్లా అటవీశాఖ అధికారి అనంత్ శంకర్ అమెజాన్ ఇండియాతో అవగాహన ఒప్పందాలపైన సంతకం చేయనున్నారు. విశాఖలోని శంభువానిపాలెంలో నివసించే గిరిజన వర్గాల వారసత్వ హస్తకళాకృతులకు అమెజాన్ యొక్క ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ నుంచి మార్కెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే, విస్తారమైన పరిధిని, వనరులను, గిరిజన హస్తకళలను ప్రదర్శించడం, విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆర్ధిక తోడ్పాటునందిస్తామని అన్నారు.