News

తిరుపతి గంగమ్మ జాతర

136views

తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం గంగ జాతర కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతూ అమ్మవారిని సేవిస్తున్నారు భక్తులు. వివిధ రకాల వేషధారణతో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. అలాగే సున్నపుకుండలు నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టు తిరుగుతున్నారు భక్తులు. భక్తుల మధ్య తోపులాటలు జరుగకుండా ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తిరుపతి గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లిని మంత్రి దర్శించుకున్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్ధించినట్లు మంత్రి పెద్దిరెడ్డి పాత్రికేయులకు తెలిపారు.