
250views
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. మహశివరాత్రి సందర్భంగా మార్చి 6వ తేదీ రాత్రి రావణాసుర వాహనసేవ జరగనుంది. ఈ నేపధ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. రామాయణంలో ఉన్నది రావణాసురుడికి పది తలలు. కాగా శ్రీకాళహస్తిలో తయారు చేసిన రావణాసురుడి వాహనానికి తొమ్మిది తలలు ఉన్నాయి. పురాణాలు, ఇతి హాసాలపై అధికారులకు అవగాహన లేక పోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





