News

సందడిగా రజతోత్సవ వేడుకలు

232views

శ్రీ కన్యకా పరమేశ్వరి కళ, విజ్ఞాన మహిళా కళాశాల రజతోత్సవ వేడుకలు పురస్కరించుకుని ‘క్యూ’, ‘సృజన తెలుగు భాషా మండలి’ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘అనుపమాన సంగీత గేయధార’, ‘భాష అభిలాష సన్మాన సంబరాల’ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సంగీత సాహితీచంద్ర సాయికృష్ణ యాచేంద్ర విచ్చేశారు. ప్రాశ్నికులుగా ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర, డాక్టర్‌ కాసల నాగభూషణం, నూకల హనుమంతరావు, శోభారాజా పాల్గొన్నారు. అనంతరం జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనచంద్ర భాషామతల్లికి నీరాజనాలు అర్పించారు. డాక్టర్‌ ఎస్‌.యజ్ఞశేఖర్‌, ఎ.మునిరత్నం ధ్రువతార పురస్కారం, దేవరకొండ రాజు, ఉధృవ పురస్కారాన్ని పి.మారుతి అందుకున్నారు. కళాశాల కరచాలకులు ఊటుకూరు శరత్‌కుమార్‌, ప్రధానాచార్యులు డాక్టర్‌ టి.మోహనశ్రీ, తెలుగుశాఖ అధ్యాపకులు డాక్టర్‌ పీఎస్‌ మైథిలి, విద్యార్థుల కార్యదర్శులు సి.కె.నందిని, డి.మానస, ఎన్‌.భానుశ్రీ, బి.పూజిత పాల్గొన్నారు.