
ఆర్‌ఎస్ఎస్ అంటే ఏంటి…?? ఏ విధమైన పనులు చేపడుతుంది..??దేశం కోసం ఎలాంటి పనులు నిర్వహిస్తుంది. అసలు ఆర్‌ఎస్ఎస్ లక్ష్యం ఏంటి..??
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్‌ఎస్ఎస్ చాలా సరళమైనది, ఏంటంటే కొంతమంది సంఘాన్ని చాలా సంక్లిష్టం వ్యవస్థగా భ్రమిస్తారు. అయితే నిజానికి చాలా సరళమైనది.ఏ విధంగా అయితే మీరు..మీ ఇంట్లో..మీ కుటుంబాన్ని..మీ మాతృమూర్తిని ప్రేమిస్తారో..ఆ విధంగానే దాన్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్లి..మీ సమాజాన్ని, మీ దేశాన్ని ప్రేమించండి.. ఆ స్ఫూర్తితోనే తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను పాటించండి. దీనికోసం అన్నివేళలా ఆ దిశగా ఎలాంటి రక్షణ తీసుకుంటారో, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో..అవి పాటించండి..ఇందుకోసం ఏమి చెయ్యాల్లో దానికి సంసిద్ధంగా ఉండంది.
ఇది చాలా తేలికైన పాఠం..ఇందుకు సంబంధించిన అభ్యాసమే సంఘంలో ఉంటుంది. అది నియమిత రూపంలో ఉంటుంది. ఏదైనా సరే, ఒక్క రోజులో రాదు కదా..అందుకే, నియమిత రూపంలో ఆచరణలోకి తెస్తాము.
మీకు క్రికెట్ ఆడాలని ఉంటే అందుకు తగ్గ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది..అలాగే మీరు ఒక మంచి వ్యక్తి కావాలనుకుంటే, దేశానికి సేవ చేయాలనుకుంటే, ఉత్తమ పౌరుడిగా మారాలంటే..దీనికి కూడా అభ్యాసం చేయాలి. ఇదే సంఘ్. ఇంతకు మించి ఏమీలేదు.
మేము సంబంధిత శాఖల్లో అభ్యాసం చేస్తాము. అనంతరం మా స్వయంసేవకులు వారి నిత్య జీవితాల్లో వాటిని అభ్యసిస్తుంటారు.ఇదే సంఘ్. ఒంటరిగా అభ్యసిస్తే..అంత ప్రభావం ఉండదు కాబట్టి అందరూ కలిసి అభ్యసిస్తే..మమ్మల్ని దేశం ఏ విధంగా అయితే కోరుకుంటుందో ఆ విధంగా ..సంఘ్‌లో చేసేది దేశంలో పునరావృతమవుతుంది. ఇదే సంఘం..
గౌరవనీయులు సునీల్ అంబేకర్ గారు
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్





