News

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల ఆహ్వానం

228views

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (యువిక) కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ (స్టెమ్‌) అంశాలపై అవగాహన కల్పించి, తద్వారా వారిని పరిశోధనల వైపు దృష్టి మళ్లించటమే లక్ష్యమని ఇస్రో వెల్లడించింది.