
458views
ముంబయి ఉగ్రదాడుల సూత్రదారి హాఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ నుంచి గుర్జన్‌వాలా వైపు వెళుతున్న సందర్భంలో సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేయూడీ చీఫ్ సయీద్‌తో పాటు నైబ్ ఇమిర్ అబ్దుల్ రహ్మాన్ మక్కీలపై దాదాపు 20 కేసులు నమోదు చేశారు. ట్రస్టుల ద్వారా సేకరించిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సయీద్‌తో లింక్ ఉన్న ఎన్జీఓ సంస్థలను ఏప్రిల్‌లో నిషేధించిన విషయం విదితమే.
Source : Andhra Bhoomi





