
ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్ చేస్తోంది.
అసలింతకీ ఏం జరిగింది? :
జార్ఖండ్ రాంచీ కి చెందిన రిచా భారతి అనే యువతి ఝార్ఖండ్ లో దొంగతనం చేస్తూ స్థానికులకి పట్టుబడ్డ తబ్రెజ్ అనే యువకుడిని స్థానికులు పట్టుకుని కొట్టిన తర్వాత కొన్ని రోజులకు చనిపోవడంతో ఆ సంఘటన మతం రంగు పులుముకుని హింసాత్మక సంఘటనలకు దారి తీస్తోంది,దీనిని ముస్లింలు మత కల్లోలాలు రేపడానకి వినియోగించుకుంటున్నారు అని అభిప్రాయపడుతూ ‘ ఒక బాధితుడి కొడుకు టెర్రరిస్ట్ గా మారుతున్నాడని మీరంతా చెప్తున్నారు..మరి కాశ్మిర్ హిందువుల సంతానం ఎందుకు టెర్రరిస్టులు కావడం లేదు??..కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఎందుకు టెర్రరిస్ట్ అవుతున్నారు? ‘ అని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దానికి నిరసనగా ఫైసల్ అనే యువకుడు రిచా భారతి మీద కేసు వేసాడు. దీంతో పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచారు.
జడ్జి వివాదాస్పద తీర్పు :
విషయం ఇక్కడే కీలకమైన మలుపు తీసుకుంది. రాంచి కోర్టు జడ్జి మనీష్ కుమార్ సింగ్ ఆ అమ్మాయి రూ|| 7000 /- ల స్వంత పూచీకత్తు తోపాటు, రాంచీ నివాసి ఒకరు, ఆ అమ్మాయి బంధువొకరు జామీను ఇస్తే ఆమెకు బెయిలు మంజూరు చేస్తామని తీర్పు ఇచ్చారు. జడ్జి గారికి ఏమనిపించిందో ఏమో తన నిర్ణయానికి మరో నిబంధనను కూడా జోడించారు. సదరు అమ్మాయి 5 ఖురాన్‌లను పంచి పెట్టాలని కూడా ఆయన ఆదేశించారు.
సరిగ్గా ఇక్కాడే కథ మలుపు తిరిగింది. జడ్జి గారి నిర్ణయానికి రిచా ఎదురుతిరిగింది ” ఒక ముస్లిం తప్పు చేస్తే అతని చేత హనుమాన్ చాలీసా పంపిణీ చేయిస్తారా? ఇప్పుడు నేను ఈ తీర్పుకు లొంగితే రేపు నన్ను ఇస్లాం లోకి మారితేనే శిక్ష తగ్గిస్తానంటారు… ఈ తీర్పును నేను గౌరవించను. జైలుకు వెళ్లడానికైనా సిద్దమే.” అని స్పష్టం చేసింది.

జడ్జి ఇచ్చిన ఆ వివాదాస్పద తీర్పుతో జార్ఖండ్, బీహార్ రెండు రాష్ట్రాలు ఆట్టుడికిపోయాయ్. హిందూ జాగరణ్ మంచ్, భజరంగ్ దళ్ కార్యకర్తలు పలు చోట్ల నిరశన ప్రదర్శనలు నిర్వహించారు. దానికి తోడు జడ్జి మనీష్ కుమార్ తీర్పుకి వ్యతిరేకంగా రాంచి బార్ అసోషియేషన్ ఆయనను బాయ్ కాట్ చేస్తున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. 48 గంటలలోగా ఆయనపై చర్యలు తీసుకోవడం కానీ, బదిలీ చెయ్యడం కానీ జరగాలని, అలా జరగని పక్షంలో తాము కోర్టులో జరిగే అన్ని ప్రొసీడింగ్స్ ను అడ్డుకుంటామని, జిల్లా జాయింట్ కలెక్టర్ కు నివేదించారు. దాంతో దిగొచ్చిన కోర్టు ఖురాన్ పంచాలనే నిబంధనను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ మరళా ఆదేశాలు జారీ చేసింది.

దాంతో రిచా భారతి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అనేకమంది ఆమె తెగువను, ధైర్యాన్ని కొనియాడుతున్నారు. “తల్లి భారతి ముద్దు బిడ్డ ఈ యువభారతి” అంటూ ఆమెను ధీర వనితగా శ్లాఘిస్తున్నారు.





