News

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఒడిశా బీజేపీ నేత బిశ్వ భూషణ్ హరిచందన్

716views

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. గత కొంతకాలంగా ఏపీకి కొత్త గవర్నర్‌ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రముఖ న్యాయవాది. జనసంఘ్‌, జనతా పార్టీలో ఆయన పనిచేశారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ  అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1988లో బిశ్వభూషణ్‌ జనతాపార్టీలో.. తిరిగి మళ్లీ 1996లో బీజేపీలో చేరారు. బిశ్వభూషణ్‌ కవి కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్‌, రాణా ప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ, మానసి అను గ్రంథాలను రాయన రాశారు.