
202views
శ్రీశైలం దేవస్థానం పులి హోర ప్రసాదంలో మాంసానికి చెందిన ఎముక ముక్కలు వచ్చాయని భక్తుడు పేర్కొనడం శుక్రవారం కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కె.వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం ముగిసిన తర్వాత అమ్మవారి ఆలయం వెనుక నిత్యప్రసాద వితరణలో భాగంగా పులిహోరను సిబ్బంది అందజేశారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని, కొరి కితే అది రెండు ముక్కలైందని, ఇదేమిటని చేతిలో వేసి చూడగా.. అది మాంసం ఎముకగా గుర్తించామని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. దీనిపై ఆలయ ఏఈవో హరిదాస్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.





