News

మత మార్పిడులను అడ్డుకోవాలి : హిందూ సంగమంలో స్వామి పరిపూర్ణానంద

537views

దేశం సుభిక్షంగా ఉండాలంటే రామరాజ్యం అవసరమని శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల మైదానంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన భారీ హిందూ సంగమం కార్యక్రమానికి ధర్మజాగరణ అఖిల భారతీయ సహ సంయోజక్‌ ఆలే శ్యామ్‌జీతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. గుడి కొట్టేవారికి కాకుండా.. గుడి కట్టేవారికి ఓటేయ్యాలన్నారు.

మత మార్పిడులను అడ్డుకోవాలి
హిందూ సమాజం బలంగా ఉంటేనే దేశం సుస్థిరంగా ఉంటుందని, అందుకు అంతా సంఘటితంగా ఉండాలని ఆలే శ్యామ్‌జీ సూచించారు. మత మార్పిడులు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల దేశంలో శత్రువులు తయారవుతున్నారన్నారు. మత మార్పిడులను అడ్డుకోవాలన్నారు.