News

చరిత్రలో నిలిచిపోనున్న రామ మందిరం ; గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి

272views

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, నాగరికతను పునరావిష్కరించుకునే కీలక ఘట్టానికి సాక్షీభూతంగా అయోధ్యలోని రామ మందిరం చరిత్రలో నిలిచిపోనుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఈ గొప్ప నిర్మాణం ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రదర్శించడంతోపాటు న్యాయ ప్రక్రియపై వారికున్న నమ్మకానికి శాసనం వంటిదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం 75వ గణతంత్ర దిన వేడుకలు జరగనున్న నేపథ్యంలో గురువారం రాత్రి జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సంక్షేమం నుంచి ప్రాంతీయ ఘర్షణలదాకా పలు అంశాలను ప్రస్తావించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని విస్తృత దృక్కోణంలో చూస్తే భవిష్యత్తు చరిత్రకారులు దీనినొక మైలు రాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత నిర్మించిన ఈ గొప్ప కట్టడం న్యాయ ప్రక్రియపట్ల ప్రజల నమ్మకానికి సాక్ష్యం’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.