
275views
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూపై పంజాబ్ పోలీసులు తాజాగా కేసు నమోదుచేశారు. మతం, జాతి ప్రాతిపాదికన వివిధ సమూహాల్లో శత్రుత్వాన్ని ప్రోత్సాహిస్తున్నాడన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. అమృత్‌సర్‌లోని శ్రీ దుర్గియానా మందిరానికి ఎలాంటి చారిత్రక ప్రాముఖ్యం లేదని, వెంటనే మందిరాన్ని మూసివేసి తాళాలను స్వర్ణ దేవాలయ నిర్వాహకులకు అప్పగించాలని బెదిరిస్తూ పన్నూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన పంజాబ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ పలుమార్లు పన్నూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు.





