News

తుంగాతీరంలో 68 అడుగుల రాముని విగ్రహం

257views

రామ నామస్మరణతో తుంగా తీరం మార్మోగింది. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలోనే కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తుంగభద్ర తీరంలో 68 అడుగుల అభయ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో భాగంగా రాముని విగ్రహం వద్ద హోమాలు, పూజలు నిర్వహించారు. శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ముస్లిం మత పెద్దలు సైతం ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 10 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు తెలిపారు. విగ్రహం చుట్టూ శ్రీరాముడి జీవిత చరిత్ర విశేషాలతో మ్యూజియం, ఉద్యానవనం నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీఅభయరామ సేవాసమితి సభ్యులు కృషి చేస్తున్నారని వెల్లడించారు. మఠంలోని యోగీంద్ర మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరాముడి గొప్పతనాన్ని ఆయన వివరించారు.