
తాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వాస్తవాధీన రేఖ వెంట (LAC) భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ‘జై శ్రీరామ్’ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత్ సైనికులు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందుకు తగినట్లుగానే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ నామస్మరణ చేయడం కనిపించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్’లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
Troops of India and China chanting #JaiShreeRam along somewhere in the border, sometimes #RamLalla #AyodhaRamMandir pic.twitter.com/AiAVX6yu15
— Anish Singh (@anishsingh21) January 22, 2024





