News

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ అక్కసు

394views

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ పరిణామం భారత్లో పెరుగుతున్న మోజారిటీవాదానికి నిదర్శనమని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. “31 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల క్రమమే నేటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఇది భారత్ లో పెరుగుతున్న మెజారిటీవాదా నికి సూచన. భారతీయ ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇదో ముఖ్యమైన ఘటన” అని ఓ ప్రకటనలో పాకిస్థాన్ అభివర్ణించింది.