
238views
అయోధ్య కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రసారం చేయడానికి అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాంచీపురం ఆలయంలో ప్రత్యక్ష వీక్షణకు నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా అనుమతి లేదని ఎల్‌ఈడీ తెరలను పోలీసులు ఆదివారం రాత్రి తొలగించారు. ఇదే విషయమై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో ఎలాంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదని తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో సోమవారం కామాక్షి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రామనామ సంకీర్తనలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. హిందువుల హక్కులు హరించాలని చూస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.





