News

పలు జిల్లాలలోని ఆలయాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలు

327views

అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవవేళ విశాఖలో సందడి వాతావరణం దర్శనమిచ్చింది.నగరంలోని రామాలయాలు పలు ఆధ్యాత్మిక సంస్థల తమ ఆనందాన్ని చాటుకుంటూ ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించాయి.‌. సీతమ్మధారలో రామభక్తులు శోభాయాత్ర నిర్వహించి తమ ఆనందాన్ని చాటుకున్నారు .అంబికా బాగ్ లోని శ్రీ రామాలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు…ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ స్వరూపానంద సరస్వతి హాజరయ్యారు. పిఠాపురం కాలనీలోని కళాభారతిలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ,విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాకారులు రామనామ సంకీర్తనతో తమ భక్తిని చాటుకున్నారు.. ఇసుక తోటలోని పురాతన రామాలయంలో బిజెపి నగర అధ్యక్షుడు మేడపాడి రవీంద్ర ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అయోధ్య బాలరాముని ప్రతిష్ట చేసిన శుభముహుర్తంలో చేసిన రామనామం, గుంటూరు జిల్లాలో ప్రతిధ్వనించింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో రధయాత్రలు, రామనామ సంకీర్తనలు చేసిన ప్రజలు, జై శ్రీరామ్ అని జయజయధ్వానాలు చేశారు. ఆలయాలలో హనుమాన్ చాలీసాపారాయణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎల్.ఇ.డి. తెరలు ఏర్పాటుచేసి, అయోధ్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, భక్తులు అసంఖ్యాకంగా వచ్చి, ఆ మహ్తత్తర ఘట్టాన్ని తిలకించి, ప్రసాదాలు స్వీకరించారు.

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పండుగ వాతావరణంలో జరగడంతో తిరుపతి జిల్లాలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయం ముందు శ్రీరాముని సంకీర్తనలు ఆలపించారు. భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 25 మంది కళాకారులు 24 గంటల పాటు శ్రీరాముని సంకీర్తనలను నిరంతరాయంగా ఆలపిస్తున్నారు. దేశ చరిత్రలో రాముని విగ్రహ ప్రతిష్ట నిలిచిపోతుందని బిజెపి నేతలు తెలిపారు. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్ట జరగడం గర్వంగా భావిస్తున్నామన్నారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామ చంద్రమూర్తిని ఆయన ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ పురుషుడు శ్రీరాముడన్నారు. వందల ఏళ్ల పోరాట ఫలితం తర్వాత అయోధ్య రామమందిరం నిర్మాణం జరుపుకోవడం విశేషమన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకూ శ్రీరాముడుపై భక్తిభావం ప్రజల్లో ఎక్కడా తగ్గలేదని తెలిపారు. శ్రీరాముడు, సీతమ్మ తల్లి త్రేతాయుగంలో రామతీర్థం వద్దకు రావడం మన అదృష్టమన్నారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ కొండపై ఉన్నాయని వివరించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తగా తాము ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.