News

అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ

272views

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఒంటరుదిన్నె గ్రామంలో సర్పంచి కేశవరెడ్డి ఆధ్వర్యంలో మారుతి వెంకటేశ్వర భజన మండలి సభ్యులు అయోధ్య రామయ్య అక్షతలను ఇంటింటికి పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అక్షతలు అందజేసినట్లు తెలిపారు. దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించాలని గ్రామ ప్రజలకు సూచించారు. అలాగే, సి.బెళగల్‌ మండలంలో అయోధ్య అక్షతల పంపిణీ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సి.బెళగల్‌లోని గొల్లల దొడ్డి, కంబలహాల్‌ అయోధ్య అక్షతల పంపిణీ చేశారు. స్థానిక వీహెచ్‌పీ నాయకులు అయోధ్య అక్షతలను సోమవారం సాయంత్రి ఇంటింటికి తిరిగి అందించారు.