
అయోధ్య రామ మందిరాన్ని పోలిన మరో ఆలయం సిద్ధమైపోయింది. కాకపోతే ఆ మందిరాన్ని సందర్శించుకోలేం. ఊరికే చూసి మురిసిపోవాలంతే. నాగ్‌పూర్‌లో ఓ సివిల్ ఇంజనీర్ అచ్చం అయోధ్య రాముల వారి ఆలయాన్ని పోలిన మందిరాన్ని కట్టాడు. 11 అడుగుల ఎత్తైన ఆలయమిది. ఇంట్లోనే ఈ రెప్లికాని తయారు చేసుకున్నాడు. అయోధ్య ఉత్సవం సందర్భంగా తన వంతుగా ఇలా ఆలయాన్ని ఇంట్లోనే నిర్మించుకున్నాడు. రామ మందిర రెప్లికాని కొనుగోలు చేసిన ఈ ఇంజనీర్ అచ్చం అలాంటి ఆకృతి ఇంట్లో ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో వెంటనే పని మొదలు పెట్టాడు.
ఈ సమయంలోనే దీన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పాడు. 1990లో కరసేవ కార్యక్రమంలో తన భార్య పాల్గొందని, ఆ సమయంలో 16 రోజుల పాటు జైల్లో ఉందని గుర్తు చేసుకున్నాడు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఆమె ఎంతో ఆరాటపడ్డారని చెప్పాడు. అయితే..తాను మాత్రం ఇలాంటి పోరాటం ఏమీ చేయలేదని అన్నాడు. అందుకే…ఇలా అయినా అయోధ్య ఉత్సవానికి తన మద్దతునివ్వాలనుకున్నట్టు వివరించాడు. ఇంటర్నెట్‌లో అయోధ్య మందిరానికి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకుని అచ్చం అలాంటి డిజైన్‌నే తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
#WATCH | Maharashtra: A civil engineer from Nagpur Prafulla Mategaonkar has made an 11-feet replica of Ayodhya's Ram Temple at his home. pic.twitter.com/RbH4gnn3hA
— ANI (@ANI) January 13, 2024
“అయోధ్య రామాలయానికి సంబంధించి ఇంటర్నెట్‌లో చాలా సమాచారం సేకరించాను. ఆ డిజైన్‌ని పరిశీలించాను. ఓ సివిల్ ఇంజనీర్‌గా వాటిని చాలా త్వరగానే అర్థం చేసుకోగలిగాను. ముందుగా ఓ గ్రాఫికల్ డిజైన్ తయారు చేశాను. ఆ తరవాత అవసరమైన మెటీరియల్‌తో నిర్మించడం మొదలు పెట్టాను. గతేడాది దీపావళి నుంచి ఈ నిర్మాణం మొదలైంది”
– ప్రఫుల్లా, సివిల్ ఇంజనీర్, మహారాష్ట్ర
VIDEO SOURCE:ANI





