News

రేపటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

258views

శ్రీశైలంలో ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మో త్సవాలు జరుగనున్నాయి. 12న బ్రహ్మో త్సవాలకు అంకురారోహణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. 13 నుంచి స్వామి, అమ్మ వార్లకు విశేష వాహన సేవలు నిర్వహిస్తారు. 13న భృంగి వాహన సేవ,14న రావణ వాహన సేవ, 15న నంది వాహన సేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న కైలాస వాహన సేవ, 17న పూర్ణాహుతి, 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం జరుగుతాయి. మకర సం క్రాంతి రోజున స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.